విజయ్ దేవరకొండ సినిమా అంటే ఎంగిలి ముద్దులు తప్పవేమో? ‘అర్జున్‌రెడ్డి’లో రెండు డజన్ల ముద్దులు కురిపించాడు విజయ్. ‘గీత గోవిందం’ సినిమా అంతా ముద్దు చుట్టూనే తిరుగుతుంది. ‘నోటా’లోనూ అధర చుంబనాలున్నాయి. ఇప్పుడు ‘డియర్ కామ్రేడ్’లోనూ అంతే. విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటిస్తున్న చిత్రమిది. ‘ఫైట్ ఫర్ లవ్’ అనేది ఉపశీర్షిక. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. భరత్ కమ్మ దర్శకుడు. ఆదివారం టీజర్‌ను విడుదల చేశారు. విద్యార్థి సంఘాలు కాలేజీలో కొట్టుకోవడంతో మొదలైన ఈ టీజర్ విజయ్ – రష్మికల ఘాటు ముద్దుతో పూర్తయింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. మే 31న ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు. ‘‘టీజర్‌లో సిద్ శ్రీరామ్ పాడిన పాటని వినిపించాం. ఆ పాటకూ, టీజర్‌కూ మంచి స్పందన లభిస్తోంది. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల చేస్తామ’’ని చిత్రబృందం తెలిపింది.

No comments:
Post a Comment