Thursday, March 14, 2019

ఎన్నికల మీడియా కేంద్రం పరిశీలన…..

శ్రీకాకుళం న్యూస్‌టుడే:
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి  జిల్లా  ఎన్నికల అధికారి, కలెక్టర్  కార్యాలయంలో  ఏర్పాటు  చేసిన  ఎన్నికల మీడియా  కేంద్రాన్ని  అధికారులతో  కలిసి కలెక్టర్   పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్  మాట్లాడుతూ  ఎన్నికలకు   మాట్లాడుతూ  ఎన్నికలకు సంబంధించిన  సమాచారం   ఎప్పటికప్పుడు  మీడియాకు తెలియజేయాలని  జిల్లా  పౌర  సంబంధాల  అధికారి  ఎల్.రమేష్ ను  ఆదేశించారు. ఎలక్ట్రానిక్,ప్రింట్,సోషల్  మీడియా  వచ్చే ప్రకటనలు,  కధనాలు,పెయిడ్  న్యూస్ లను  ప్రతి రోజూ  నిశితంగా  పరిశీలించాలన్నారు.  ఎన్నికల వ్యయంలో వచ్చే వాటిని అందులో చేర్చాలన్నారు. ఎలక్ట్రానిక్‌ మీడియా, ఎస్‌.ఎం.ఎస్‌., వాయిస్‌ కాల్స్‌ తదితర ప్రసారాలకు కచ్చితంగా ముందస్తు అనుమతి ఉండాలన్నారు. కేబుల్‌ నెట్‌వర్కు వారు సైతం విధిగా నిబంధలు పాటించాలన్నారు. పరిశీలనలో జేసీ కె.వి.ఎన్‌.చక్రధరబాబు, జేసీ మీడియా వెరిఫికేషన్, మానిటరింగ్‌ కమిటీ నోడల్‌ అధికారి పి.రజనీకాంతరావు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment