కడప న్యూస్‌టుడే :ముఖ్యంశాలు…..
*కంపెనీ నిర్వాహకుడు మహ్మమద్ షరీఫ్ వద్ద నుంచి రూ.1,44,400 సీజ్ చేశారు..
సింహాద్రిపురం:- పాతపల్లి మలుపు వద్ద ఏర్పాటు చేసిన తనిఖీ కేంద్రం వద్ద రికార్డులు లేకుండా తరలిస్తున్న రూ.4,06000 నగదును స్వాధీనం చేసుకొన్నట్లు ఎస్‌ఐ సంజీవరెడ్డి తెలిపారు. సోమవారం అర్ధరాత్రి సమయంలో సింహాద్రిపురం నుంచి యల్లనూరుకు వెళుతున్న బీడీ…ల కంపెనీ నిర్వాహకుడు మహ్మమద్ షరీఫ్ వద్ద నుంచి రూ.1,44,400 సీజ్ చేశారు. మంగళవారం ప్రొద్దుటూరుకు చెందిన కోడిగుడ్ల వ్యాపారి రమణారెడ్డి వద్ద నుంచి రూ.3,016,00 సరైన రికార్డులు లేకపోవటంతో స్వాధీనం చేసుకొని ఎన్నికల అధికారికి అందజేశామన్నారు.
నందలూరు :- మండలంలోని లేబాక క్రాస్ వద్ద ఏర్పాటు చేసిన ఎన్నికల తనిఖీ కేంద్రం వద్ద సోమవారం రాత్రి చేపట్టిన తనిఖీల్లో అధికారులు ఓ ఆటోలో ప్రయాణిస్తున్న వ్యక్తి వద్ద రూ.1.59,500 నగదు గుర్తించారు. ఇందుకు సంబంధించి ఎటువంటి పత్రాలను చూపకపోవడంతో ఆ నగదును స్వాధీనం చేసుకొన్నట్లు తనిఖీ అధికారి ప్రసాద్ తెలిపారు. పట్టుబడిన నగదును ఆదాయ పన్ను శాఖాధికారులకు అప్పగిస్తున్నట్లు పేర్కొన్నారు. తనిఖీలో ఈవోపీఆర్డీ ప్రసాద్, ఎస్‌ఐ సయ్యద్ హుస్సేన్, పోలీసులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment