కందుకూరు, న్యూస్‌టుడే:
మద్యం సీసాలు అక్రమంగా నిల్వ చేసిన దుకాణంపై ఎక్సైజ్ అధికారులు మంగళవారం దాడి చేసి సుమారు రూ.42 లక్షలు విలువైన సరకును సీజ్ చేశారు. ఎక్సైజ్ శాఖ సీఐ ఖాజామొహిద్దీన్ దీనికి సంబంధించిన వివరాలు తెలిపారు. ఒంగోలు డిప్యూటీ కమిషనర్ శ్రీమన్నారాయరణ ఆదేశాల మేరకు ఏఈఎస్ వై.చంద్రశేఖర రెడ్డి, ఆయన కందుకూరు సర్కిల్ పరిధిలోని మద్యం దుకాణాలపై దాడులు చేయగా… కందుకూరు మండల పరిధిలోని పలుకూరులో నిర్వహిస్తున్న లక్కీ వైన్స్ దుకాణంలో 580 బాక్సుల మద్యం సీసాలు, 331 బాక్సుల బీరు సీసాలు పర్మిట్ రూమ్‌లో నిల్వ ఉంచినట్లు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దుకాణాన్ని సీజ్ చేశారు. నౌకరునామా తలారి ప్రతాప్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పట్టుబడిన సరకు విలువ సుమారు రూ.42 లక్షలు ఉంటుందని ఆయన తెలిపారు

No comments:
Post a Comment