నైజీరియా న్యూస్‌టుడే:
*నైజీరి యాలో స్కూల్ బిల్డింగ్ కూలి పదిమంది విద్యార్థులు మృతి..
*శిథిలాల కింద ఇంకెంత మంది ఉన్నారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది….
నైజీరియాలో విషాదం చోటు చేసుకుంది.లాగోస్ ఐలాండ్‌లోని ఓ స్కూల్ బిల్డింగ్ కూలిన ఘటనలో పది మంది విద్యార్థులు మృతి చెందారు.ఇదే ఘటనలో స్థానికులు దాదాపుగా 40 మంది విద్యార్థులను స్థానికులు,ఎమర్జన్సీ టీంలు కాపాడాయి.గాయపడిన విద్యార్థులను దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు.కాగా పాఠశాలలో 100 మందిదాకా విద్యార్థులు చదువుతున్నట్లు తెలుస్తుండగా..శిథిలాల కింద ఇంకెంత మంది ఉన్నారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

No comments:
Post a Comment