Friday, March 8, 2019

అయోధ్య భూ వివాద కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం….

హైదరాబాద్ : అయోధ్య భూ వివాద కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఇష్యూని పరిష్కరించేందుకు ముగ్గురితో కమిటీ వేసిన సర్వోన్నత న్యాయస్థానం .. విచారణ వివరాలను వెల్లడించకూడదని స్పష్టంచేసింది. ఎన్నో ఏళ్లుగా విచారణ జరుగుతోన్న సున్నితమైన అయోధ్య భూ వివాదం కేసును సుప్రీంకోర్టు మాజీ జస్టిస్ ఖలిపుల్లా నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో మధ్యవర్తిత్వ కమిటీ వేసింది. ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్, సీనియర్ న్యాయవాది శ్రీరామ్ పంచ్ కమిటీ సభ్యులుగా ఉంటారు.

No comments:

Post a Comment