ఒంగోలు,న్యూస్‌టుడే:
- జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఎలక్టోరల్ లిటరసీ క్లబ్‌లు ఏర్పాటు చేయాలని జేసీ నాగలక్ష్మి ఆదేశించారు.
- స్థానిక పాత జడ్పీ కార్యాలయం సమావేశ భవనంలో బుధవారం ఎలక్టోరల్ లిటరసీ క్లబ్‌ల ఏర్పాటులో భాగంగా ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలతో ఆమె సమావేశం నిర్వహించారు.
- ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఉన్నత పాఠశాలల్లో9, 10వ తరగతి చదువుతున్న విద్యార్థులతో క్లబ్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
తదనంతరం ఎన్నికల ప్రక్రియపై విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించాలని, ఓటుహక్కు వినియోగంపై గ్రామాల్లో ప్రజలను చైతన్యులను చేయాలని సూచించారు. యువతీ యువకులను గుర్తించి ఓటు హక్కు నమోదు చేయించేలా ప్రధానోపాధ్యాయులు బాధ్యత తీసుకోవాలన్నారు. అనంతరం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, వీవీప్యాట్‌ల పనితీరుపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో భాగంగా ఎన్నికల విధానంపై క్విజ్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. సమావేశంలో డీఈవో సుబ్బారావు, స్టెప్ సీఈవో రవికుమార్ పాల్గొన్నారు.

No comments:
Post a Comment