మచిలీపట్నం న్యూస్‌టుడే:
1.టీఅన్యూస్10 ఆన్‌లైన్ ఎడిషన్ …
2.స్టోరేజ్ పాయింట్‌కు చేరిన ప్రశ్నపత్రాలు తరలింపు….
పోర్టురోడ్డు మచిలీపట్నం:ఈనెల 18వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు జరగనున్న నేపథ్యంలో పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలు బందరు పట్టణంలోని నిర్మల పాఠశాల స్టోరేజ్ పాయింట్‌కు చేరుకున్నాయి. ఇద్దరు కానిస్టేబుళ్లు వెంటరాగా పటిష్ఠ బందోబస్తు మధ్య ప్రశ్నపత్రాలను మినీవ్యానులో నిర్మల పాఠశాలకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా డీఆర్వో ఎ.ప్రసాద్, గుడివాడ ఆర్డీవో చక్రపాణి, డీఈవో రాజ్యలక్ష్మి తదితరులు స్టోరేజ్ పాయింట్‌కు చేరుకున్నారు. డీఆర్వో ప్రసాద్ విద్యాశాఖ సిబ్బందికి తగు సూచనలు చేశారు. ఆయన మాట్లాడుతూ స్టోరేజ్ పాయింట్ నుంచి అన్ని డివిజన్లకు తరలించాల్సిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించాలన్నారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా బందోబస్తు నడుమ పోలీస్‌స్టేషన్లకు పంపించే దిశగా తగు చర్యలు తీసుకోవాలన్నారు. మార్గమధ్యంలో ఎటువంటి అవకతవకలు, లోటుపాట్లు తలెత్తకుండా అనుక్షణం అప్రమత్తంగా ఉండాలన్నారు. స్టోరేజ్ పాయింట్ వద్ద అగ్నిప్రమాదం సంభవించడం, వర్షానికి తడవడం వంటి ఇబ్బందులను అధిగమించే దిశగా తగు ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలన్నారు. డీఈవో రాజ్యలక్ష్మి సీల్డు కవర్‌లో ఉంచిన తాళం చెవిని సిబ్బందికి అందించి మినీవ్యాన్ తాళాలు తీయించారు. అనంతరం ప్రశ్నపత్రాలను స్టోరేజ్‌పాయింట్‌లోకి తరలించారు.ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ లింగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment