Tuesday, March 19, 2019

ప్రభుత్వ నిథుల విడుదల ఎలా జాప్యం………….


కృష్ణా  న్యూస్‌టుడే:
*విసన్నపేటలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరైనా, వీటిని సంబంధిత వ్యక్తులకు చెల్లించకుండా అధికారులు వేధింపులకు పాల్పడుతున్నారని పలువురు గుత్తేదారులు ఆరోపించారు.
విస్సన్నపేటకు చెందిన గుత్తేదారు అట్లూరి వెంకట దుర్గా రాంప్రసాద్‌ ఆధ్వర్యంలో స్థానిక మండల పరిషత్తు కార్యాలయ ప్రాంగణంలో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విస్సన్నపేట పంచాయతీలో రూ.50 లక్షలతో సీసీ రహదారుల నిర్మాణాలు చేపట్టామని, వీటికి సంబంధించిన కొంత మొత్తం ఇటీవల పంచాయతీ ఖాతాకు ప్రభుత్వం జమ చేసిందన్నారు. ఈ నగదును పనులు చేపట్టినవారికి చెల్లించేందుకు పంచాయతీ కార్యనిర్వహణాధికారి అడ్డంకులు చెబుతున్నారని, కమీషన్ల కోసమే ఇలా వేధింపులకు పాల్పడుతున్నట్లు వారు ఆరోపించారు. ఈ విషయాన్ని మండల పరిషత్తు అధికారి ఎం.రాజు దృష్టికి తీసుకెళ్లగా ఆయన జారీ చేసిన ఆదేశాలు పాటించలేదని విమర్శించారు. మండలంలోని అన్ని పంచాయతీల్లో పనులు చేపట్టినవారికి నిధులు అందినా, విస్సన్నపేటలోనే ఇలా జరుగుతోందన్నారు. పంచాయతీ కార్యనిర్వహణాధికారి ఎం.సరోజినిని వివరణ కోరగా పనులకు సంబంధించిన నగదు తమ ఖాతాలోకి వచ్చిన మాట వాస్తవమేనన్నారు. పంచాయతీ ప్రత్యేకాధికారిగా వ్యవహరిస్తున్న తహసీల్దారు ఎం.సావిత్రికి బాధ్యతలు పూర్తిస్థాయిలో చేరకపోవటంతో నగదు ఇచ్చేందుకు అవకాశం లభించలేదన్నారు. తహసీల్దారుకు పంచాయతీ బాధ్యతలు సంపూర్ణంగా చేరితేనే నిధులు డ్రా చేసేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. తాను కమీషన్లు కోరిన మాట అవాస్తవమన్నారు. సమావేశంలో పలువురు గుత్తేదారులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment