Tuesday, March 19, 2019

గర్భిణుల పరీక్షలు, టీకాలు వారిపై చర్యలు…..

ప్రకాశం న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు….
* టీన్యూస్10 ఆన్‌లైన్ ఎడిషన్……
 *ప్రజలకు ఓఆర్‌ఎస్‌ ద్రావణం ప్యాకెట్లను పంపిణీ …..

మాతా శిశు మరణాల నివారణే ధ్యేయంగా వైద్య సిబ్బంది విధులు నిర్వహించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి ఎస్‌.రాజ్యలక్ష్మి సూచించారు. సి.ఎస్‌.పురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం ఆమె తనిఖీ చేసి వైద్య సిబ్బందితో సమీక్షించారు  సిబ్బంది అందుబాటులో ఉండడం లేదని ఫిర్యాదులు అందితే వారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ నెల 15న మృతిచెందిన సి.ఎస్‌.పురానికి చెందిన గర్భిణి దరిశి దొరసానమ్మ వైద్య పరీక్షల నివేదికలను పరిశీలించారు. అవి సజావుగా లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పీహెచ్‌సీల్లో ప్రసవాల సంఖ్యను పెంచాలన్నారు. ప్రజలకు ఓఆర్‌ఎస్‌ ద్రావణం ప్యాకెట్లను పంపిణీ చేయాలని ఆదేశించారు. గర్భిణుల పరీక్షలు, టీకాలు తదితర విషయాలపై సిబ్బందికి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వైద్యాధికారిణి ఎ.సుజన, డీపీహెచ్‌ఎన్‌వో ఎం.సుగుణమ్మ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment