నర్సీపట్నం అర్బన్, న్యూస్‌టుడే: రాజధాని ప్రాధికార సంస్థలో ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బు వసూలు చేసి మోసం చేశారన్న ఆరోపణపై ఇద్దరిపై కేసు నమోదు చేసినట్టు ఎ.ఎస్.ఐ. శంకరరావు తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన చక్రవర్తి నర్సీపట్నంలోని యర్రంశెట్టి మౌనిక మరో ఐదుగురు నుంచి రూ.50 వేలు నుంచి రూ.1.50 లక్షల వరకు వసూలు చేశారు. వీరికి నకిలీ నియామక పత్రాలు, నకిలీ గుర్తింపు కార్డులు ఇచ్చారు. మోసపోయామని గుర్తించిన మౌనిక ఫిర్యాదు చేయడంతో చక్రవర్తితో పాటు ఆయనకు మధ్యవర్తిగా సహకరించారన్న ఆరోపణపై గొలుగొండ గురుకుల పాఠశాల ఉపాధ్యాయుడు రాజారావుపై కేసు నమోదు చేసినట్టు వివరించారు.

No comments:
Post a Comment