Wednesday, March 13, 2019

అవి నవ రత్నాలు కాదు.. నాటక రత్నాలు………


శ్రీకాకుళం,న్యూస్‌టుడే:
వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన నవరత్నాలు ఎన్నికల ముందు ప్రజలను మభ్యపెట్టే నాటక రత్నాలు అని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. మంగళవారం ఆమదాలవలస పట్టణంలోని శారదా ఫంక్షన్‌ హాలులో ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధిలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి రాష్ట్ర అనాథ బాలల దత్తత కమిటీ సభ్యులు బోర గోవిందరావు అధ్యక్షత వహించారు. ముందుగా ఎంపీ రామ్మోహన్‌ నాయుడు మాట్లాడుతూ ప్రతి కార్యకర్త సైనికుల్లా తెలుగుదేశం పార్టీ గెలుపుకు కృషి చేయాలని అన్నారు.తెలుగు దేశం ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనుల గురించి ప్రజలకు తెలియపరిచి ఎన్నికల్లో పార్టీకి బాసటగా నిలిచేలా చూడాలన్నారు..అనంతరం ప్రభుత్వ విప్‌ కూన రవికుమార్‌ మాట్లాడుతూ ఆమదాలవలస మున్సిపాలిటీలో గత 25 ఏళ్లుగా రాజకీయ ప్రస్థానం కలిగి రాష్ట్ర మంత్రిగా పనిచేసిన తమ్మినేని సీతారాం చేయలేని అభివృద్ధిని ఈ అయిదేళ్లలో చేసి చూపించానని అన్నారు. .ఈ సమావేశంలో మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ తమ్మినేని గీత, కళింగ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ దువ్వాడ కృష్ణమూర్తినాయుడు, వెలమ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ ముద్దాడ కృష్ణమూర్తి, తెదేపా నాయకులు బగాది సుశీల, కూన వెంకటరాజ్యలక్ష్మి, మొదలవలస రమేష్, బొర గోవిందరావు, తమ్మినేని విద్యాసాగô, రెడ్డి రాంబాబు, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment