కిడ్నీ వ్యాధి విషయంలో అప్రమత్తత అవసరం………కిడ్నీ వ్యాధుల విషయంలో మరింత ప్రాథమిక అప్రమత్తత అవసరమని, శుద్ధజలం లాంటి చర్యలతో ప్రయోజనాలు కనిపించొచ్చని జాతీయ వైద్య విధానమండలి పరిశోధన ప్రతినిధి, ప్రముఖ నెఫ్రాలజిస్టు డాక్టర్ వివేకానంద ఝా పేర్కొన్నారు. మంగళవారం ఆయన సోంపేటలో ఎమ్మెల్యే డాక్టర్ బెందాళం అశోక్‌తో పాటు వైద్యాధికారులతో ప్రత్యేకంగా సమావేశమై కిడ్నీ వ్యాధుల అంశమై చర్చించారు.శుద్ధజలం వినియోగం గణనీయంగా పెరిగిన అంశం కిడ్నీ వ్యాధి విషయంలో సానుకూల మార్పులకు దోహదం చేయొచ్చన్నారు. ఫిజీషియన్ డాక్టర్ వల జోగినాయుడు కిడ్నీ వ్యాధుల పరంగా పరిశీలించిన పలు అంశాలను నివేదిక రూపంలో వివేకానంద ఝాకు అందజేశారు. కవిటిలో ఫిజీషియన్‌ను నియమించాలని, సోంపేటలో కౌన్సిలర్‌తో పాటు డేటా ఆపరేటర్‌ను ఏర్పాటుచేస్తే వివరాల నమోదుకు, అవగాహన చర్యలకు అవకాశం ఉంటుందని డాక్టర్ జోగినాయుడు సూచించగా, రెండో అంశంపై సానుకూలంగా స్పందించారు. ఎమ్మెల్యే అశోక్ మాట్లాడుతూ ఉచిత మందుల వినియోగం విషయంలో రోగులు అపోహలు వీడేలా అవగాహన పెంచాలని వైద్యులను కోరారు.

No comments:
Post a Comment