Wednesday, March 20, 2019

ప్రజల కోసమే టీడీపీ…….

విజయనగరం కొమరాడ, న్యూస్‌టుడే:ముఖ్యంశాలు……
*మంగళవారం కొమరాడలో ఎన్నికల ప్రచార సభను నిర్వహించారు……
విభజన చట్టం అమల్లో రాష్ట్రానికి మోదీ ప్రభుత్వం అన్యాయం చేసిందని కేంద్ర మాజీ మంత్రి, అరకు పార్లమెంటరీ తెదేపా అభ్యర్థి వైరిచర్ల కిషోర్‌చంద్రదేవ్‌ అన్నారు. మంగళవారం కొమరాడలో ఎన్నికల ప్రచార సభను నిర్వహించారు. ఈ సమావేశానికి అధ్యక్షతగా మండల కన్వీనరు గులిపల్లి సుదర్శనరావు వ్యవహరించారు. ఈ సందర్భంగా కిశోర్‌చంద్రదేవ్‌ మాట్లాడారు. విభజన హామీ చట్టంలో రాష్ట్రానికి పలు అంశాల్లో మేలు జరగాలని ఉన్నప్పటికీ కేంద్రంలో మోదీ సర్కారు అమలు చేయకుండా రాష్ట్రానికి మొండిచేయి చూపారని విమర్శించారు. పెట్టుబడుదారులకు, పెత్తందారులకు కేంద్రం కొమ్ము కాస్తుందన్నారు. కేంద్రమంత్రిగా పనిచేసే కాలంలో గుణుపూర్‌ నుంచి మక్కువ, సాలూరు మీదుగా అరకు రైలు మార్గం ఏర్పాటు చేసేవిధంగా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. అటవీహక్కుల చట్టంపై కేంద్రం తీసుకున్న నిర్ణయిం సరైనది కాదన్నారు.
                                                                                               

No comments:

Post a Comment