Wednesday, March 20, 2019

కొంచెం ఇష్టం కొంచెం కష్టం…


ప్రకాశం ఒంగోలు: 
  
1,టీన్యూస్10 ఆన్‌లైన్ ఎడిషన్ ….
2.ప్రచార వేగం పెంచిన తెదేపా శ్రేణులు…
3. చల్లార్చే ప్రయత్నాల్లో తెదేపా అధిష్ఠానం…
కనిగిరి కార్యకర్తలు పట్టు వీడటం లేదు. దర్శి నాయకులు దిగిరావడం లేదు… రెండు నియోజకవర్గాల్లోనూ తెదేపా టికెట్ల కేటాయింపులపై అసంతృప్తులు చల్లారడం లేదు. రెండు చోట్ల తెదేపా కార్యకర్తలు మంగళవారం సమావేశాలు ఏర్పాటు చేసుకుని అభ్యర్థులను మార్చాలని కోరారు. మరోవైపు వైకాపాలో మార్కాపురం సీటు కేటాయింపు అంశం చిచ్చు రగిల్చింది. ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇస్తేనే పార్టీలో కొనసాగి, అభ్యర్థికి మద్దతిద్దామని జంకె అనుచరులు ఆయనపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఎంపీ అభ్యర్థి శిద్దా రాఘవరావు మంగళవారం కొండపి నియోజకవర్గంలో సమావేశాలు నిర్వహించి ప్రచారం చేశారు. మార్కాపురం, అద్దంకి, పర్చూరు, యర్రగొండపాలెం, చీరాల నియోజకవర్గాల్లో అభ్యర్థులు అంతర్గత సమావేశాలు ఏర్పాటు చేశారు.

No comments:

Post a Comment