ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌టుడే:
ఎన్నికల ప్రవర్తనా నియమావళి పక్కాగా అమలు చేయాలని జిల్లా సంయుక్త కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని వీక్షణ సమావేశం నుంచి అన్ని మండల తహసీల్దార్లు, ఎంపీడీవోలతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఎన్నికల కోడ్ వెలువడిన నేపథ్యంలో 48 గంటల్లోగా ప్రభుత్వ ప్రచార బోర్డులు, ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు, రాజకీయ నాయకులు ఫొటోలు తక్షణమే తొలగించాలని చెప్పారు. గ్రామాలు, మండలాలు, జిల్లా సరిహద్దుల్లో పర్యవేక్షణ బృందాల తనిఖీలు చేయాలి. సీసీకెమెరాలు పరిశీలన, వాహనాల తనిఖీలు చేయాలని సూచించారు. నగదు, మద్యం పంపిణీ జరగకుండా ప్రలోభాలకు తావు లేకుండా చేయాల్సిన బాధ్యత ప్రవర్తనా నియమావళి అమలు చేసే అధికారులదేనన్నారు. సమావేశంలో జేసీ-2 డాక్టరు ఎ.సిరి, డీఆర్వో వి.వెంకటసుబ్బయ్య, ప్రత్యేక ఉప కలెక్టర్ చంద్రమౌళి, 12 నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులు, వివిధ కమిటీ అధికారులు, మండల తహసీల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.

No comments:
Post a Comment