సింధియా, న్యూస్‌టుడే:
- ఎన్నో ఏళ్ల నుంచి పరిష్కారం కాని యార్డు సమస్య ఎట్టకేలకు తీరిందన్నారు పోర్టు ట్రస్టు ఛైర్మన్ టి.కృష్ణబాబు …
- రవాణా సిబ్బంది సంక్షేమానికి కృషి చేయాలి….
- రవాణా వ్యవస్థలో పని చేస్తున్న సిబ్బంది సంక్షేమానికి ఆయా యాజమాన్యాలు కట్టుబడి ఉండాల్సిందేనని విశాఖ పోర్టు ట్రస్టు ఛైర్మన్ టి.కృష్ణబాబు అన్నారు.
సోమవారం పోర్టు ఎగ్జిమ్‌పార్కు వద్ద కొత్తగా నిర్మించిన లారీ పార్కింగ్ యార్డుని ఆయన ప్రారంభించి మాట్లాడారు. పోర్టు సమగ్ర అభివృద్ధిలో రవాణారంగ యజమానులు, సిబ్బంది కీలకపాత్ర పోషిస్తున్నారన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి పరిష్కారం కాని యార్డు సమస్య ఎట్టకేలకు తీరిందన్నారు. యార్డు నిర్వహణను పూర్తిగా యజమానులే పర్యవేక్షించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వీపీటీ డిప్యూటీ ఛైర్మన్ పి.ఎల్.హరనాథ్, చీఫ్ ఇంజినీర్ ఎ.కె.మోహ్రా, పోర్టు అధికారి టి.ఎన్.హరికృష్ణ, స్టీవ్‌డోర్ సంఘం అధ్యక్షుడు కృష్ణకుమార్, మల్కాపురం ట్రాఫిక్ సీఐ ఎస్.వాసుదేవ్, ఎస్సై శ్రీరంగులు, విశాఖ లారీ ఆపరేటర్ల సంఘం ప్రతినిధులు కేవీఎస్ వర్తి, వి.ఎ.నాయుడు, కె.ఎ.రావు, పి.ఎల్.నారాయణ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment