Wednesday, March 20, 2019

పంజాబీ వంకాయ కూర‌………

కావల్సినవి:
  • గుండ్రటి, చిన్న వంకాయలు – పది నుంచి పన్నెండు.
  • జీలకర్ర -అరచెంచా.
  • సన్నగా తరిగిన ఉల్లిపాయముక్కలు – పావుకప్పు.
  • కొత్తిమీర తరుగు – పావుకప్పు.
  • నూనె – మూడుటేబుల్‌స్పూన్లు.
మసాలా కోసం కావల్సినవి:
  • మెంతులు – అరచెంచా.
  • యాలకులు – రెండు.
  • బిర్యానీ ఆకులు-రెండు.
  • దాల్చినచెక్క – ఒకటి పెద్దది.
  • ధనియాలు – పావుకప్పు.
  • జీలకర్ర – చెంచా.
  • అల్లం ముక్కలు – చెంచా.
  • ఉల్లిపాయముక్కలు -ముప్పావుకప్పు.
  • పసుపు – అరచెంచా.
  • ఎండుమిర్చి – ఐదారు(నీళ్లల్లో నానబెట్టుకోవాలి).
  • ఆమ్‌చూర్‌పొడి – అరచెంచా.
  • టొమాటో ముక్కలు – అరకప్పు.
  • నూనె – పావుకప్పు కన్నా తక్కువగా.
  • ఉప్పు – తగినంత.
తయారీ విధానం: ముందు మసాలా తయారుచేసుకోవాలి. బాణలిలో నూనె వేడిచేసి ఉల్లిపాయ, టొమాటో ముక్కలూ, ఎండుమిర్చీ తప్ప మసాలా కోసం పెట్టుకున్న మిగిలిన పదార్థాలన్నీ వేసి వేయించుకుని మిక్సీలో తీసుకోవాలి. అందులో ఎండుమిర్చీ, తగినంత ఉప్పూ, ఉల్లిపాయ, టొమాటో ముక్కలూ వేసి మెత్తని పేస్టులా చేసుకోవాలి. ఇప్పుడు వంకాయలు విడిపోకుండా నాలుగు భాగాలు వచ్చేలా కోసి ఈ మిశ్రమాన్ని వాటిల్లో కూరాలి. బాణలిలో మిగిలిన నూనె వేడిచేసి జీలకర్ర వేయించాలి. అందులోనే ఉల్లిపాయముక్కలూ వేయించి వంకాయల్ని ఒక్కొక్కటిగా ఉంచాలి. పైన మిగిలిన మసాలా కూడా వేసి, పావుకప్పు నీళ్లు పోసి మంట తగ్గించాలి. వంకాయ విడిపోకుండా మధ్యమధ్య కలుపుతూ ఉంటే కాసేపటికి కూర తయారవుతుంది. అప్పుడు దింపేసి కొత్తిమీర తరుగు వేస్తే చాలు. నోరూరించే వంకాయ కూర తయార్‌. ఇది అన్నంలోకే కాదు, రోటీల్లోకీ బాగుంటుంది.

No comments:

Post a Comment