Monday, March 18, 2019

సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా జిల్లాకు …..

సచివాలయం, కర్నూలు న్యూస్‌టుడే:
*జిల్లాకు ఎన్నికల వ్యయ పరిశీలకులు వస్తున్నారు…
సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా జిల్లాకు ఎన్నికల వ్యయ పరిశీలకులు వస్తున్నారు. కలకత్తా నుంచి వచ్చిన ఐఆర్‌ఎస్‌ అధికారి బైద్‌నాథ్‌ సింగ్‌ నంద్యాల, పాణ్యం ఎన్నికల వ్యయ పరిశీలకులుగా, ద్రుబ జ్యోతిరే బనగానపల్లె, డోన్‌ నియోజకవర్గాలకు, యస్‌పాల్‌ చావ్లా ఆలూరు, ఆదోని నియోజకవర్గాలకు ఎన్నికల వ్యయ పరిశీలకులుగా నియమించారు. వీరు ముగ్గురు ఈ రోజు జిల్లాకు రానున్నారు. నామినేషన్ల ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కావడంతో ఆయా నియోజకవర్గాల్లో వారు పర్యటించే అవకాశం ఉంది. 

No comments:

Post a Comment