చెన్నైన్యూస్‌టుడే:
* మీ రాక కోసం ఎదురుచూస్తున్న కోట్లాది అభిమానులు..
* మీరు రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని కోరుతున్నా…
రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి లేదని తమిళ కథానాయకుడు అజిత్ ఇప్పటికే చెప్పారు. అయితే ఆయన వస్తే ప్రజలకు మేలు జరుగుతుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు అజిత్‌ను ఉద్దేశిస్తూ దర్శకుడు సుశీంద్రన్ సోషల్‌మీడియాలో ఓ పోస్ట్ చేశారు. ‘40 ఏళ్ల ద్రవిడ రాజకీయాల్లో మార్పు రావాలంటే అది నీ వల్ల మాత్రమే సాధ్యమౌతుంది. తమిళనాడు ప్రజల కోసం మీరు రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని కోరుతున్నా. మీకు ఇదే సరైన సమయం. ముందడుగు వేయండి. రాజకీయాల్లో మీ రాక కోసం ఎదురుచూస్తున్న కోట్లాది అభిమానుల్లో నేనూ ఒక్కడ్ని’ అని దర్శకుడు లేఖలో పేర్కొన్నారు.
అజిత్ ప్రస్తుతం ‘పింక్’ తమిళ రీమేక్ ‘నేర్కొండపార్వాయ్’లో నటిస్తున్నారు. ఇందులో అజిత్ లాయర్ పాత్రలో నటిస్తున్నారు.

No comments:
Post a Comment