కర్నూలు న్యూస్‌టుడే:
మండల పరిధిలోని తూర్పు ప్రాతకోట గ్రామంలో తండ్రి మృతి చెందినా పదో తరగతి పరీక్షకు హాజరు కావడంతో ‘జీవితానికే పరీక్ష’ అనే శీర్షిక బుధవారం ఈనాడులో కథనం ప్రచురితమైంది. దీంతో ఐసీడీఎస్ సీడీపీవో కోటేశ్వరమ్మ స్పందించారు. ఈ సందర్భంగా ఆమె గ్రామానికి చేరుకొని పూజితను పరామర్శించి కుటుంబ పరిస్థితిపై ఆరా తీశారు. పూజితను, ఆమె తమ్ముడిని ఒకే వసతి గృహంలో ఉంచి ఉన్నత చదువులు చదివేంత వరకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆమె తల్లి శంకరమ్మ ఆరోగ్య పరిస్థితి గురించి ఉన్నతాధికారులతో చర్చించి వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తామన్నారు.

No comments:
Post a Comment