విశాఖపట్నం న్యూస్‌టుడే : ముఖ్యంశాలు:
*ముమ్మరంగా బండారు ప్రచారం..
పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ప్రచారాన్ని ముమ్మరం చేశారు.
సోమవారం 70వ వార్డు లక్ష్మీపురంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి ప్రచారాన్ని ప్రారంభించారు.
లక్ష్మీపురంలో ఓటర్లను కలుసుకుని సైకిల్‌గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు.
ఎన్టీఆర్ గృహ నిర్మాణ లబ్ధిదారులతో సంభాషించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఐదేళ్లు పేదల కోసం కష్టపడ్డారని, ప్రతిపక్షాల మాటలు వినకుండా తెదేపాకు మళ్లీ పట్టం కట్టాలని కోరారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చామన్నారు. మరోఅవకాశం కల్పిస్తే నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు.మహిళలు బండారుకు తిలకందిద్ది. దిష్టి తీసి వాడవాడలకు రావాలని ఆహ్వానించారు. మహిళల ఉత్సాహాన్ని చూస్తుంటే తెదేపా తప్ప రాష్ట్రంలో మరే పార్టీకి స్థానం ఉండదనే విషయం స్పష్టమవుతోందన్నారు. అనంతరం చీమలాపల్లి, పొర్లుపాలెం గ్రామాల్లో పర్యటించారు. వార్డు అధ్యక్షుడు గళ్లా వెంకటరమణ, ఆళ్ల తాతారావు, అయిత ఎర్నిబాబు, గంతకోరుమాధవరావు, ఒమ్మిసత్యం, దాట్లమధు, కరకదేముడు, అవగడ్డ అప్పలనాయుడు, అడ్డాల రామరాజు, మామిడి దుర్గాప్రసాదు, దమరసింగు శ్రీదేవి పాల్గొన్నారు.
No comments:
Post a Comment