తూర్పు గోదావరి రాజమహేంద్రవరం న్యుస్‌టుడే:
*శిరో మణి పీహెచ్‌సీలో నర్సుగా పనిచేసి పదవీ విరమణ పొందారు..
విశ్రాంత నర్సు నుంచి రూ.2 వేలు డిమాండ్ చేసిన వైద్యాధికారికి మూడేళ్ల జైలుశిక్ష, రూ.6 వే ల జరిమానా విధిస్తూ రాజమహేంద్రవరం ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎ.గాయత్రీదేవి తీర్పు చెప్పారు. 2007 ఫిబ్రవరి 26న నమోదైన ఈ కేసు వివరాలు ఏసీబీ డీఎస్పీ ఎం.సుధాకరరావు మంగళవారం తెలిపారు. తునికి చెందిన ఎం.శిరోమణి పీహెచ్‌సీలో నర్సుగా పనిచేసి పదవీ విరమణ పొందారు. తనకు రావల్సిన జీపీఎఫ్ మంజూరు నిమిత్తం ఇవ్వాల్సిన పత్రాల కోసం తాను పనిచేసిన పిఠాపురం మండలం విరస పీహెచ్‌సీ వైద్యాధికారి జి.విజయమోహన్‌ను సంప్రదించారు. దీనినిమిత్తం ఆయన రూ.2 వేలు డిమాండ్ చేయడంతో విసిగిపోయిన ఆమె తన భర్త కృష్ణమూర్తి సహకారంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారి సూచనమేరకు సంబంధిత మొత్తాన్ని వైద్యాధికారికి ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకుని అతడిని అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు. కేసు వాదోపవాదాల నేరారోపణ రుజువు కావడంతో విజయమోహన్ (ప్రస్తుతం పెద్దాపురం ఏరియా ఆసుపత్రిలో మెడికల్ అధికారి)కి పైవిధంగా శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారని ఏసీబీ డీఎస్పీ తెలిపారు.
No comments:
Post a Comment