Monday, March 18, 2019

పెసర, మినుము రైతులకు మార్కెట్లో మద్దతు……..

విజయనగరం న్యూస్‌టుడే:
*రైతులు ఊరట పొందేలా ప్రభుత్వం కృషి.
పెసర,మినుము రైతులు మద్దతు ధర పొందేలా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చేందుకు కృషి చేసిన కలెక్టర్,సంబంధిత అధికారులకు ఆంధ్రప్రదేశ్ రైతు సంగం జిల్లా కమీటి కృతఙ్ఞతలు తెలియజేసింది.పెసర, మినుము రైతులు మార్కెట్లో మద్దతు ధర అందక, క్వింటా వద్ద రూ.2 వేలు వరకు నష్టపోతున్నారని, కొనుగోలు కేంద్రాలు పెట్టి రైతులను ఆదుకోవాలని తాము దశలవారీగా డిమాండు చేస్తూ కలెక్టర్ వినతిపత్రాలు అందజేశామన్నారు. ఈ నేపథ్యంలో  మినుములు 1500 మెట్రిక్ టన్నులు, పెసలు 720 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. దీంతో జిల్లా రైతాంగానికి ఊరట లభించిందని చెప్పారు.

No comments:

Post a Comment