న్యూజిలాండ్ న్యూస్‌టుడే:ముఖ్యంశాలు:
- తృటిలో తప్పించుకున్న క్రికెట్ జట్టు..
- ఆ తర్వాత వాళ్లు సురక్షితంగా హోటల్‌కి చేరుకున్నారు…
సెంట్రల్ క్రిస్ట్‌చర్చ్‌లోని ఓ మసీద్‌లో గుర్తు తెలియని ఆగంతకుడు కాల్పులకు తెగబడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో పలువురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ఘటన నుంచి బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు తృటిలో తప్పించుకుంది. ఈ విషయాన్ని జట్టు ఆటగాడు తమీమ్ ఇక్బాల్ ట్వీట్ చేశాడు. ‘‘షూటర్ల నుంచి మొత్తం టీం తప్పించుకుంది. ఇది చాలా భయంకరమైన అనుభవం. మీ అందరి ప్రార్థనలే మమ్మల్ని కాపాడాయి’’ అంటూ తమీమ్ పేర్కొన్నాడు.హగ్లే ఓవెల్‌లోని మైదానంలో బంగ్లా క్రికెట్ జట్టు ప్రాక్టీస్‌కి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ‘‘సుమారు మధ్యాహ్నం 1.45 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. ఆటగాళ్లు చాలా భయపడిపోయారు. ఒక్కసారిగా తుపాకీ శబ్దాలు వినపడటంతో ఆటగాళ్లు పరుగు తీశారు. ఆ తర్వాత వాళ్లు సురక్షితంగా హోటల్‌కి చేరుకున్నారు.

No comments:
Post a Comment