ముంబై న్యూస్‌టుడే:
- టి న్యూస్ 10 ఆన్ లైన్ ఎడిషన్
- ఈ- కామర్స్‌లోకి ముఖేష్ అంబానీ
- కలిసొచ్చిన విదేశీ పెట్టుబడులపై ఆంక్షలు
భారత అపర కుబేరుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఎండీ ముఖేష్ అంబానీ ప్రపంచ కుబేరుడు జెఫె బెజోస్‌కు చెందిన అమెజాన్ డాట్‌కామ్‌తో పాటు వాల్‌మార్ట్ ఫ్లిప్‌కా ర్ట్‌ను ఒకేసారి ఢీ కొట్టబోతున్నారు. దీనికి గాను ముందుగా ఆయన చౌకరకం ఫ్యాషన్ స్టోర్‌లను రిలయన్స్ ట్రెండ్స్ స్టోర్‌లను వచ్చే ఐదు సంవత్సరాల్లో 2,500 స్టోర్‌లకు విస్తరించాలనుకుంటున్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 557 స్టోర్‌లను నిర్వహిస్తున్నారు. ఈ వ్యాపారాలను ఆన్‌లైన్‌లో విలీనం చేయాలనుకుంటున్నట్లు దీనికి ఆయన ప్రణాళికలు సిద్ధం చేసినట్లు అత్యంత సన్నిత వర్గాల ద్వారా తెలిసింది.రిలయన్స్ ట్రెండ్స్ స్టోర్‌ల ద్వారా భారత్ కన్స్యుమర్ మార్కె ట్లో పోటీ దిగ్గజం కంపెనీలైన అమెజాన్ డాట్‌కామ్ ఐఎన్‌సీ, వాల్‌మార్ట్ ఐఎన్‌సీ ఫ్లిప్‌కార్ట్‌ల నుంచి పెద్దమొత్తంలో వాటా దక్కించుకోవాలని ముఖేష్ అంబానీ భావిస్తున్నారు. ప్రస్తు తం భారతీయ వినియోగదారుడు ఆన్‌లైన్‌లో సరకులు, ఫ్యాషన్ దుస్తులు, యాక్సెసరీస్‌పై పెద్దమొత్తంలో వ్యయం చేస్తున్నాడు. దీన్ని అనువుగా తీసుకోవాలని అంబానీ భావిసు³ ్తన్నారు. పనిలో పనిగా.. ప్రభుత్వం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడు లపై కొన్ని ఆంక్షలు విధించడంతో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు తాత్కాలికంగా విలవిల్లాడుతున్నాయి. దీన్ని అదునుగా తీసుకొని ముఖేష్ ఈ- కామర్స్, ఫ్యాషన్ వ్యాపారాలను విస్తరించుకోవాలనుకుంటున్నారు.

No comments:
Post a Comment