గుంటూరుజిల్లా: అమరావతి:న్యూస్‌టుడే: ముఖ్యాంశాలు…
*అవకాశం ఇస్తే భూములు, ఆస్తులు కబ్జా…
*అభ్యర్ధుల ఎంపికపై అంతటా సానుకూలత…
వైసీపీకి అవకాశం ఇస్తే భూములు, ఆస్తులు కబ్జా చేస్తారని సీఎం చంద్రబాబు అన్నారు. ఎలక్షన్ మిషన్ పై చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. టీడీపీ అభ్యర్ధులు, బూత్ కన్వీనర్లు, సేవాసమిత్రలు హాజరయ్యారు. ఈ సందర్భముగా సీ ఎం మాట్లాడుతూ ప్రజల్లో టీడీపీ పట్ల సానుకూలత అద్భుతంగా ఉందని స్పష్టం చేశారు. అత్యంత పారదర్శకంగా అభ్యర్ధులను ఎంపిక చేసినట్లు తెలిపారు. అభ్యర్ధుల ఎంపికపై అంతటా సానుకూలత ఉందని చెప్పారు. 37 ఏళ్ల చరిత్రలో ఇంత సానుకూలత ఎప్పుడూ లేదన్నారు. అసంతృప్తి నేతలకు భవిష్యత్తులో న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.

No comments:
Post a Comment