సబ్బవరం, విశాఖ న్యూస్‌టుడే:
*అనుమానాస్పదంగా వెళ్తున్న కారును అనకాపల్లి ఎన్‌డీఎస్ పోలీసులు వెంటాడి సోదా చేశారు…
*కారు డిక్కీ తెరిస్తే తలగడల్లా కనిపించే గంజాయి సంచులు…
108 కిలోల గంజాయి పట్టివేత…సబ్బవరం మండలం దేవీపురం వద్ద 108కిలోల గంజాయిని అనకాపల్లి ఎన్‌డీపీఎస్ ఎస్సై చంద్రమౌళి, సిబ్బంది పట్టుకున్నారు. స్థానిక ప్రొహిబిషన్, ఎక్సైజ్ సీఐ నర్సింహమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. దేవీపురం వద్ద బుధవారం సాయంత్రం 3గంటల సమయంలో అనుమానాస్పదంగా వెళ్తున్న కారును అనకాపల్లి ఎన్‌డీఎస్ పోలీసులు వెంటాడి సోదా చేశారు. అందులో తలగడల్లా కనిపిస్తున్న సంచుల్లో 108 కిలోల గంజాయిని ఉంచి తరలిస్తున్నట్లు గుర్తించారు. దీని విలువ రూ.2.70లక్షలు ఉంటుందని, పాడేరు నుంచి తమిళనాడుకు తరలిస్తున్నారని పోలీసులు తెలిపారు. నిందితులు తమిళనాడు రాష్ట్రం తిరువల్లూరు జిల్లా మాధవవరానికి చెందిన జనార్దన్ కళారాణి బాలాజీ (43), కుంబం ఉత్తంపాళ్యం గ్రామానికి చెందిన విజయ్ (29)లను అదుపులోకి తీసుకున్నామన్నారు. వీరి నుంచి రూ.వెయ్యి నగదు, 3 సెల్‌ఫోన్లు, కారును స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వివరించారు.

No comments:
Post a Comment