Saturday, March 9, 2019

రైల్వే స్టేషన్‌లో మినీ థియేటర్….

విశాఖ న్యూస్‌టుడే:
*సగం ధరకే సినిమా చూడొచ్చు…
* పిల్లల కోసం గేమింగ్‌ జోన్ రూ.35 కోట్లతో డివిజల్ అభివృద్ది పనులు…
*విశాఖ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల కోసం గేమింగ్‌ జోన్‌ను అందుబాటులోకి తెస్తున్నామన్నారురైల్వేశాక అధికారులు…
శనివారం విలేకరుల సమావేశంలో రైల్వే శాఖ అధికారులు మాట్లాడుతూ  డివిజన్‌లో అభివృద్ధి పనుల గురించి వివరిస్తూ విశాఖ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల కోసం గేమింగ్‌ జోన్‌ను అందుబాటులోకి తెస్తున్నామన్నారు. పిల్లలు ఆడుకునేందుకు వీలుగా క్రీడా పరికరాలను అందుబాటులో ఉంచుతామన్నారు. మినీ థియేటర్‌ నిర్మిస్తామని, సగం ధరలకే ఇక్కడ సినిమాలను వీక్షించొచ్చన్నారు. పనులెన్నో.. డివిజన్‌లోని 112 రైల్వే స్టేషన్లలో ఈ ఏడాది రూ. 35 కోట్లతో వివిధ పనులు చేస్తున్నామన్నారు. చాలావరకు పూర్తయ్యాయని, మరికొన్ని చివరి దశలో ఉన్నాయని వివరించారు. మూత్రశాలలు లేని 74 స్టేషన్లలో వాటిని నిర్మించామని, శిథిలమైనచోట్ల కొత్తవి ఆధునికంగా నిర్మించామన్నారు. రైల్వే ట్రాక్‌లు స్వచ్ఛంగా కనిపించేలా పోర్‌బందర్‌ విధానాన్ని పాటిస్తున్నామన్నారు. చాలా స్టేషన్లలో సంస్కృతి, కళలు ఉట్టి పడేలా సుందరీకరణ పనులు చేపట్టామన్నారు. విశాఖ పోర్టు ట్రస్టు, రైల్వే మధ్య 15 సంవత్సరాలుగా నలుగుతున్న సమస్యకు పరిష్కారం చూపామన్నారు. క్రీడా మైదానాన్ని ఆధునిక వసతులతో అందుబాటులోకి తెచ్చామని చెప్పారు.
                                                                                    

No comments:

Post a Comment