రాజమండ్రి న్యూస్‌టుడే:
- నిజాయితీ పాలనకు శ్రీకారం
- ఓట్ల కొనుగోలుకు చరమగీతం
- నిరుద్యోగంపై యుద్ధం
- జనసేన ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్
రానున్న ఎన్నికలు మార్పుకు నాంది అని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ప్రకటించారు. ఇంతకాలం కొనసాగుతున్న సంప్రదాయ రాజకీయ విధానాలకు ఈ ఎన్నికల్లో జనసైన్యం పాతరేస్తుందన్నారు. స్వచ్ఛమైన, నిజాయతీగల పాలనకు ఈ ఎన్నికలు శ్రీకారం చుడతాయన్నారు. ఇంతవరకు కొనసాగిన ఓట్ల కొనుగోలు వ్యవహారానికి ఈ ఎన్నికల్తో చరమగీతం పాడేద్దామన్నారు. నిరుద్యోగంపై యుద్దం నినాదంతో జనసేన ఈ ఎన్నికల్లో తలబడబోతోందని స్పష్టం చేశారు. జనసేన 5వ ఆవిర్భావ సభను గురువారం రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహిం చారు. దీనికి ఎన్నికల యుద్ధ శంఖారావంగా పవన్ నామకరణం చేశారు. లక్షలాదిమంది జనసైనికులు, పవన్ అభిమానులు ఈ సభకు హాజరయ్యారు. పోటెత్తిన జనసైన్యంతో రాజమండ్రి నగర వీధులు నిండిపోయాయి. నగరమంతా జనసేన జెండాలు, నినాదాల్తో మారుమ్రోగిపోయింది. ఈ సభనుద్దేశించి పవన్ ఆవేశంగా ప్రసంగించారు. పార్టీ స్థాపించేందుకు దారితీసిన కారణాల్ని వివరించారు. గతెన్నికల్లో బిజెపి, తెలుగుదేశంలకు మద్దతివ్వడానిగ్గల కారణాల్ని విశదీకరించారు. ఈ సారి ఒంటరిగానే పోటీపడు తున్నట్లు స్పష్టం చేశారు. నిజాయితీ, నిబద్దతలకే ప్రాధాన్యతిస్తూ పార్టీ సీట్లు కేటాయిస్తున్నామన్నారు. ఈ ఎన్నికల్తో తెలుగుదేశం, వైకాపాలకు జనం గట్టిగా బుద్ది చెబుతారన్నారు.

No comments:
Post a Comment