Thursday, March 14, 2019

ముంబైలో కుప్పకూలిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి.. నలుగురి మృతి..

ముంబై: ముంబైలో ఘోర ప్రమాదం జరిగింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (సీఎస్ఎంటీ) సమీపంలో పాదచారుల వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో పదుల సంఖ్యలో గాయపడినట్టు తెలుస్తోంది. సీఎస్ఎంటీ ప్లాట్‌ఫాం 1కు దారితీసే వంతెన కుప్పకూలడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు.
ఈ ఘటనలో ఇప్పటి వరకు నలుగురు మృతి చెందగా, 34 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. ఈ ఘటనతో ఒక్కసారిగా ట్రాఫిక్ స్తంభించింది. సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

No comments:

Post a Comment