అంబాజీపేట, న్యూస్‌టుడే:
* రవికుమార్ అంబాజీపేట నుంచి ఇసుకపూడిలోని ఇంటికి వెళుతుండగా వెంకటగిరి అడ్డగించి అతనిపై చాకుతో దాడి చేశాడు..
పాత వివాదాల నేపథ్యంలో ఇసుకపూడికి చెందిన ఓ యువకుడిపై ఆదే గ్రామానికి చెందిన మరో యువకుడు ఆదివారం రాత్రి చాకుతో దాడి చేశారు. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన ఆ యువకుడు కాకినాడలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీనికి సంబంధించిన వివరాలను ఎస్‌హెచ్‌వో పి.వీరవెంకటసత్యనారాయణ సోమవారం విలేకరులకు అందజేశారు. ఇసుకపూడికి చెందిన బీర రవికుమార్ ఫొటోగ్రాఫర్‌గా జీవనం సాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన గంటా వెంకటగిరి కూడా ఫొటోగ్రాఫచరే. వీరిద్దరి మధ్య ఉన్న పాత వివాదాలు నేపథ్యంలో ఆదివారం రవికుమార్ అంబాజీపేట నుంచి ఇసుకపూడిలోని ఇంటికి వెళుతుండగా వెంకటగిరి అడ్డగించి అతనిపై చాకుతో దాడి చేశాడు. రవికుమార్ ఎడమ దవడ నుంచి మెడ వరకు తీవ్రంగా గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం అమలాపురం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం కాకినాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించినట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
No comments:
Post a Comment