కర్నూలు న్యూస్‌టుడే:
*వెనకబడిన వర్గాలకు సీట్లు కేటాయించిన ఘనత జగన్‌కే దక్కుతుందని కర్నూలు పార్లమెంటు వైకాపా అభ్యర్థి డాక్టర్ సంజీవ్‌కుమార్ ఆరోపించారు.
..పేద వర్గాలకు ఇచ్చిన మాట కోసం కట్టుబడి బీసీలకు సీట్లిచ్చారని చెప్పారు..
బీసీల డిక్లరేషన్ ప్రకటించి పార్లమెంటు అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల్లో వెనకబడిన వర్గాలకు సీట్లు కేటాయించిన ఘనత జగన్‌కే దక్కుతుందని కర్నూలు పార్లమెంటు వైకాపా అభ్యర్థి డాక్టర్ సంజీవ్‌కుమార్ ఆరోపించారు. ఆదివారం వైకాపా జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. సంక్షేమం, అభివృద్ధి, విశ్వసనీయత అనేది వైఎస్ డీఎన్‌ఏలోనే ఉన్నాయన్నారు. ఆయన కుమారుడిగా జగన్..పేద వర్గాలకు ఇచ్చిన మాట కోసం కట్టుబడి బీసీలకు సీట్లిచ్చారని చెప్పారు. నా మీద నమ్మకంతో కర్నూలు వైకాపా పార్లమెంటు అభ్యర్థిగా అవకాశం కల్పించారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకొని పార్టీలోని అన్ని విభాగాల సహకారంతో ప్రజల ఆశీస్సులతో గెలిచి జగనన్నకు కానుకగా ఇస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏడుగురు ఎంపీలు, 41 మంది ఎమ్మెల్యేల స్థానాలు బీసీ సామాజిక వర్గానికి ఇచ్చారంటే బీసీలపై వైస్ జగన్‌కు ఉన్న ప్రేమను అర్థం చేసుకోవచ్చని వివరించారు. జిల్లాలో తాగు, సాగు నీటికి ప్రాధాన్యం ఇచ్చి ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానని తెలిపారు.

No comments:
Post a Comment