వివేకా సహజ మరణం అని చెప్పిన దాని వెనుక వుందెవరు?వివేకానంద హత్యకు చంద్రబాబు కారణమంటున్న జగన్,విజయసాయి రెడ్డి చంద్రబాబుది నేర మనస్తత్వం అంటున్నారు.వీరిది ఏ కుటుంబమో చెప్పండి మరి.బుద్ధిమంతుల కుటుంబమా…ప్రజలకు తెలియదా?..తండ్రి రాజశేఖర రెడ్డి చినిపోతే ..హెలికాప్టర్ ప్రమాదానికి గురైతే సోనియా గాంధీ,రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ కారణమని అప్పట్లో ఆరోపించారు.రాజశేఖర రెడ్డిని చంపితే సోనియా,అంబానీ ముఖ్యమంత్రి అవుతారా?రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు వివేకానంద రెడ్డిని కొట్టిన జగన్ రాజశేఖర రెడ్డి మరణానంతరం వివేకా కాంగ్రెస్ పార్టీలో ఉండి తన అల్లుడిని కాంగ్రెస్ పట్టాన నిలబెట్టలని ప్రయత్నించారు.పులివెందులలో వైసీపీ తరపున విజయలక్ష్మి పోటీ చేస్తే కాంగ్ర్స్ తరపున వివేకా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు.అప్పటి నుంచి వీరిద్దరికి సత్సంబంధాలు లేవు.జగన్ జైలులో ఉన్నప్పుడు కలవటానికి వెళ్లిన వివేకాను జగన్ కలవలేదు.వివేకానంద రెడ్డి హత్య జరిగింది.రక్తపు మడుగులో ఉంటే గుండెపోటు అని ఎందుకు చెప్పారు.కడపలో హత్యలు చూడలేదా?రక్తపు మరకలు ఎందుకు కడిగారు.గంగిరెడ్డి ఎందుకు వెళ్ళిపోయారు.డ్రైవర్ గురించి లెటర్ రాసే సమయంలో ఫోన్ చేయవచ్చుగా?పిఏ కృష్ణా రెడ్డి ఎవరి కనుసన్నలలో పని చేస్తున్నారు?బాడిని కదిలించకూడదని తెలియదా?ప్రజలను మభ్యపెడుతున్నారా?
No comments:
Post a Comment