Sunday, March 10, 2019

ఎన్నికల సమరానికి నగారా మోగింది….

 న్యూస్‌టుడే:
  • *నెల రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి…
  • ఫలితాల కోసం 42 రోజులు వేచిచూడాల్సిందే…
సార్వత్రిక ఎన్నికల సమరానికి నగారా మోగింది. కేవలం నెల రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇంతవరకు బాగానే ఉన్నా ఫలితాల కోసం అభ్యర్థులకు ముచ్చెమటలు పట్టక తప్పదు. ఎలాంటి ఫలితాలొస్తాయో… ఎంత మెజార్టీ వస్తుందో తెలుసుకునేందుకు నెల రోజులపైనే వేచి చూడాల్సి ఉంది. భారతదేశంలో మొత్తం ఏడు దశల్లో అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. దీనిలో ఆంధ్రప్రదేశ్‌ మొదటి దశలో ఉంది. చివరి దశ ఎన్నికలు మే 19వ తేదీతో ముగుస్తాయి. అందరితో కలిపి ఫలితాలు మే 23న విడుదల చేయనున్నారు. దీంతో జిల్లాలో వివిధ పార్టీల అభ్యర్థులు ఏప్రిల్‌ 11 పోలింగ్‌ రోజు నుంచి మే 23 వరకు అంటే 42 రోజులు వేచి చూడాల్సిందే. దీంతో ఎన్నికల బరిలో ఉండే అభ్యర్థులతోపాటు ఫలితాలపై బెట్టింగ్‌ వేసే పందెంరాయుళ్లు సైతం కళ్లల్లో ఒత్తులేసుకోవాల్సిందే.

No comments:

Post a Comment