వత్సవలస న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు…..
- టీన్యూస్10ఆన్‌లైన్ ఎడిషన్ …
- మాఘమాస వేడుకలు ….
- అధిక సంఖ్యలో భక్తులు ముందురోజే…
గార మండలంలోని వత్సవలస గ్రామంలో నిర్వహించే రాజరాజేశ్వరిదేవి ఉత్సవాలకు నాలుగో ఆదివారం జనం పోటెత్తారు. గత వడు వారాల్లాగే నాలుగో వారం భక్తులు కోలాహలంగా అమ్మవారిని దర్శించుకొన్నారు. మైళపిల్లి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు ఉత్సవాలను నిర్వహించారు. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు పక్క రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు ముందురోజే నుంచే చేరుకొని అమ్మవారిని దర్శించుకున్నారు. మొక్కులు చెల్లించుకున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తుల సౌకర్యార్ధం నిర్వాహకులు తాగునీరు, విద్యుత్తు దీపాలు, వసతి సౌకర్యాలను సమకూర్చారు. ఉత్సవాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోండా గార ఎస్సై లక్ష్మణరావు ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు నిర్వహించారు. ఉత్సవాలకు వచ్చే వాహనాలను తూలుగు మీదుగా వత్సవలసకు పంపించారు. ఉత్సవాల నుంచి తిరిగి ప్రయాణమైన వాహనాలను శ్రీకూర్మం మీదుగా శ్రీకాకుళం వైపు పోలీసులు పంపించారు.

No comments:
Post a Comment