Monday, March 18, 2019

పట్టాలు తప్పడంతోనే ప్రమాదం….

కాంగో న్యూస్‌టుడే:
*కాంగోలో రైలు ప్రమాదం
*ప్రమాదంలో 24 మందికి పైగా మృతి.
 కాంగోలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 24 మంది మృతి చెందినట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. అనేక మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో చిన్నారులు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. వివరాలు…కాంగోలోని కసాయ్‌ ప్రావిన్స్‌లో ఆదివారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పట్టాలు తప్పడంతోనే ఈ దుర్ఘటన సంభవించినట్లు సమాచారం. ఈ క్రమంలో కొన్ని బోగీలు పక్కనే ఉన్న నదిలో పడ్డాయని అధికారులు తెలిపారు. సిబ్బంది ఘటనా స్థలానికి చేరకుని సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రులకు తరలించారు. ఒక నెల వ్యవధిలో ఇది మూడో రైలు ప్రమాదమని రైల్వే విభాగం తెలిపింది. గత నెలలో జరిగిన ఓ ప్రమాదంలో ఐదుగురు చనిపోయినట్లు తెలిపారు.

No comments:

Post a Comment