కావలసినవి :
- ఉడికించిన కోడిగుడ్లు: నాలుగు.
- మిరియాలపొడి: టీస్పూను.
- కొత్తిమీర తురుము: అరకప్పు.
- గోధుమపిండి: పావుకిలో.
- నూనె లేదా నెయ్యి: వేయించడానికి సరిపడా.
తయారుచేసే విధానం : ఓ గిన్నెలో ఉడికించిన గుడ్లను సన్నగా తురిమినట్లుగా కోయాలి. అందులోనే మిరియాలపొడి, కొత్తిమీర తురుము, ఉప్పు వేసి కలపాలి. ఓ గిన్నెలో గోధుమపిండి, ఉప్పు, టేబుల్‌స్పూను నెయ్యి, తగినన్ని నీళ్లు పోసి కలిపి సుమారు పావుగంటసేపు నాననివ్వాలి. ఇప్పుడు పిండిముద్దను చిన్న ఉండల్లా చేసుకుని ఒక్కోదాన్ని చిన్న చపాతీలా వత్తాలి. తరవాత అందులో గుడ్డుమిశ్రమాన్ని పెట్టి అంచులు మూసేసి మళ్లీ చపాతీలా వత్తి పెనంమీద నెయ్యి లేదా వెన్న వేస్తూ రెండువైపులా కాల్చి తీయాలి.

No comments:
Post a Comment