Wednesday, March 13, 2019

ముందు జగ్రత్తగా పావులు …?

బెంగళూరున్యూస్‌టుడే:
*  ఏడుసార్లు తన ఎంపీలను గెలిపించుకున్న బీజేపీ..
* 8వ విజయం కోసం తహతహలాడుతోంది. 
దక్షిణ కన్నడ లోక్‌సభ నియోజకవర్గం నుంచి వరుసగా ఏడుసార్లు తన ఎంపీలను గెలిపించుకున్న బీజేపీ 8వ విజయం కోసం తహతహలాడుతోంది. ఈసారి కాంగ్రెస్‌-జేడీఎస్‌లు పొత్తు కుదుర్చుకోనుండడంతో ముందు జాగ్రత్తగా పావులను సిద్ధం చేసుకుంటోంది. దక్షిణకన్నడ లోక్‌సభ నియోజకవర్గం నుంచి 1991, 1996, 1998, 1999లలో వి.ధనంజయకుమార్‌ బీజేపీ టికెట్‌పై  గెలుపొందారు. 2004లో డి.వి.సదానంద గౌడ గెలుపొందారు. విశేషం ఏంటంటే వీరిద్దరూ కేంద్ర కేబినెట్‌లో చోటు సంపాదించుకోగలిగారు. 2009, 2014లో నళిన్‌కుమార్‌ కటీల్‌ బీజేపీ టికెట్‌పై విజయపతాకం ఎగురవేశారు. ఈసారి కూడా బీజేపీ నళిన్‌కుమార్‌కే టికెట్‌ మంజూరు చేయడం దాదాపు ఖాయమైంది. ఆర్‌ఎస్‌ఎస్‌, సంఘ్‌పరి వార్‌ బలంగా ఉన్న ఈ నియోజకవర్గం బీజేపీకి కంచుకోట.

No comments:

Post a Comment