Monday, March 18, 2019

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు కొత్త బ్యాంక్ ఖాతా…

తూర్పు గోదావరి న్యూస్‌టుడే :
*ఎన్నికల అభ్యర్థుల కొత్త ఖాతా..
*ఎన్నికల ఖర్చు లావాదేవీలన్నీ ఆ అకౌంట్‌ ద్వారానే నిర్వహించాలి…
 ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా కొత్త బ్యాంకు ఖాతా తెరవాలని జిల్లా రిటర్నింగ్‌ అధికారి వెల్లడించారు. సోమవారం ఉదయం జిల్లా రిటర్నింగ్‌ అధికారి విలేకరులతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ నామినేషన్‌కు కనీసం ఒక రోజు ముందు కొత్త అకౌంట్‌ తెరవాలని చెప్పారు. ఎన్నికల ఖర్చు లావాదేవీలన్నీ ఆ అకౌంట్‌ ద్వారానే నిర్వహించాలని సూచించారు. నామినేషన్‌ వేసే ఎంపి అభ్యర్థి రూ.25 వేలు, ఎంఎల్‌ఎ అభ్యర్థి రూ.10 వేలు నగదు రూపంలో రిటర్నింగ్‌ అధికారికి చెల్లించాలని, ఎస్‌సి, ఎస్‌టి అభ్యర్థులు 50 శాతం చెల్లిస్తే సరిపోతుందని పేర్కొన్నారు.

No comments:

Post a Comment