ప్రకాశం ఒంగోలు న్యూస్‌టుడే:
1.టీన్యూ10ఆన్‌లైన్ అడిషన్..
2.బేల్దారీ పనులు చేసుకుంటూ జీవనం….
3.ప్రమాదాన్ని గుర్తించిna ఇద్దరు యువకులు ..
ద్విచక్ర వాహనం- మినీ లారీ ఢీకొన్న సంఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ సంఘటన దర్శి పంచాయతీ పరిధిలోని కొత్తరెడ్డిపాలెం సమీపంలో పెద్ద కాలువ వద్ద ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దర్శికి చెందిన చిన్నం నాగేశ్వరరావు(25) పొదిలికి చెందిన అతని స్నేహితుడు చాపల్లి రాముతో కలిసి ద్విచక్ర వాహనంపై పొదిలికి వెళ్తున్నారు. పొదిలి వైపు నుంచి వస్తున్న మినీ వాహనాన్ని కొత్తరెడ్డిపాలెం సమీపంలో వేగంగా ఢీకొట్టారు. దీంతో వారు రోడ్డు మీద పడిపోయారు. దర్శి నుంచి అటుగా వెళ్తున్న ఇద్దరు యువకులు ప్రమాదాన్ని గుర్తించి క్షతగాత్రులను వేరే వాహనం ద్వారా దర్శి సామాజిక వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో నాగేశ్వరరావును మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ అంబులెన్స్‌లో ఒంగోలుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో అతను మృతి చెందారు. తీవ్రంగా గాయపడ్డ రామును ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం ఒంగోలు తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు మినీ లారీని, చోదకుడిని స్టేషన్‌కు తరలించారు. నాగేశ్వరరావు బేల్దారీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తండ్రి వెంకటేశ్వర్లు మృతి చెందగా, తల్లి అంజమ్మ కూలి పనులు చేసుకుంటూ జీవిస్తోంది. నాగేశ్వరరావుకు ఇంకా వివాహం కాలేదు. ఈ వేసవిలో పెళ్లి చేయాలనుకుంటూండగా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. గాయపడ్డ రాము కూడా బేల్దారీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శశికుమార్ తెలిపారు.
No comments:
Post a Comment