గుంటూరుజిల్లా:న్యూస్‌టుడే: ముఖ్యాంశాలు…
‘అంబేద్కర్ సమగ్ర దృక్పథం’…..
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ లోని డాక్టర్ అంబేద్కర్ చైర్ ఆధ్వర్యంలో ‘అంబేద్కర్ సమగ్ర దృక్పథం ‘ అంశంపై రెండురోజుల జాతీయ సదస్సు ప్రారంభమైంది. విసి ప్రొఫెసర్ రామ్‌జీ సదస్సును ప్రారంభించిన అనంతరం రాజశేఖర్ కీలకోపన్యాసం చేశారు. అంబేద్కర్ విద్యావేత్తగా ఆర్ధికవేత్తగా, జర్నలిస్టుగా, న్యాయవాదిగా, రాజకీయ నాయకునిగా, ఉద్యమనాయకునిగా, తత్వవేత్తగా, సంఘ సంస్కర్తగా నిలిచారని చెప్పారు. ఆయన ఆలోచనా దృక్పథం ఖండాంతరాలు దాటిందని, సమానత్వంసాంఘిక సంక్షేమం కోసం అంబేద్కర్ అహర్నిశలూ కృషి చేశారని వివరించారు. ఈ శతాబ్దంలో అంబేద్కర్ ఆలోచనా విధానం పెద్ద ఎత్తున విస్తరించడం ఆయన అంబేద్కరిజం అంటే దళితులకు సంబంధించిదనే భావన సరికాదన్నారు.

No comments:
Post a Comment