Friday, March 8, 2019

శ్రీశ్రీ రవిశంకర్ హెచ్చరిక……

హైదరాబాద్: అయోధ్యలో రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదాన్ని పరిష్కరించడానికి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన మధ్యవర్తిత్వ కమిటీలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు, ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త పండిట్ శ్రీ శ్రీ రవిశంకర్ ను నియమించడాన్ని తప్పుపడుతున్నారు. గతంలో ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యానాలే దీనికి కారణం.
మధ్యవర్తిత్వ కమిటీలో శ్రీ శ్రీ రవిశంకర్ ను నియమించడం సహేతుకం కాదని హైదరాబాద్ లోక్ సభ సభ్యుడు, మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఆయన స్థానంలో తటస్థుడిని నియమించాలని అన్నారు. అయోధ్య రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదంలో శ్రీశ్రీ రవిశంకర్ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ భూమి మొత్తాన్నీ హిందువులకు అప్పగించకపోతే.. భారత్ మరో సిరియాలా మారుతుందని శ్రీశ్రీ రవిశంకర్ హెచ్చరించారు.
                                                                          

No comments:

Post a Comment