కౌతాళం న్యూస్‌టుడే:
మతసామరస్యానికి ప్రతీకగా నిలిచిన కౌతాళం ఖాదర్ లింగా స్వామి దర్గాలో శుక్రవారం ఆయన 399వ జన్మదిన వేడుకలు నిర్వహించనున్నారు. ఉదయం స్వామి సమాధిని శుభ్రం చేసి ప్రత్యేకంగా అలంకరిస్తారు. ఫాతేహాలు, సలాం గీతాలు నిర్వహించనున్నారు. స్థానిక లింగాయత్‌లు సమాధి పటాన్ని గ్రామంలోని ప్రధాన వీధుల్లో ఊరేగిస్తారు. అర్ధరాత్రి దాటాక స్వామివారి సమాధి వద్ద కేకు కోసి భక్తులకు పంచుతారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలిరానున్నారు.
No comments:
Post a Comment