Monday, March 18, 2019

మహాప్రత్యంగిరరూప వర్ణన


నేలనుండి నింగిని తాకేటట్టుండే మహాభారీకాయంతో కూడిన స్త్రీ దేహం ఆ స్రీ దేహము కారుచీకటితో కూడిన నల్లనివర్ణం మగసింహపు వెయ్య తలలతో ఒకవైపు ఎర్రని నేత్రాలు మరోవైపు నీలి నేత్రాలతో రెండు వేల ముప్పై రెండు చేతులతో ఒకచేతిలో త్రిశూలము మరోచేతిలో సర్పము అలంకారంగా చుట్టుకున్న డమురుకము, మరో చేతిలో ఈటె వంటి కత్తి మరో చేతిలో అసురుని శిరస్సు మిగతా అన్ని చేతులలో విభిన్న ఆయుధాలతో మెడలో కపాల మాలతో  అత్యంత పొడువైన కేశాలతో కేశాల చివర శక్తి తో కూడిన తంతువులు నాల్గు సింహల స్వర్ణ రధం పై(ఈ నాల్గు సింహాలను నాల్గు వేదాలు గా కొందరు మరికొందరు నాల్గు పురుషార్ధాలుగానూ ఇంకొందరు నాల్గు ధర్మాలగానూ విశ్లేషిస్తారు సాధకులు) ఉద్భవించింది. ఈమె ఉద్భవించిన సరస్సు నేటికి హిమాచల్ ప్రదేశం లోని ఒక రహస్య ప్రదేశము లో వుంది. ఆ సరస్సులో నీళ్ళు పసుపు పచ్చని వర్ణంలో వుంటాయి. ఈ సరస్సుకు ఎల్లప్పుడు సింహాల గుంపు కాపలాగావుంటుంది అని ఎంతో మంది సిద్ధ సాధకులు నిక్కచ్చగా చెపుతున్నారు.

No comments:

Post a Comment