గుంటూరు న్యూస్‌టుడే:
25 రోజులు మాత్రమే తెదేపా పాలన ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.అధికారంలోకి ఎలాగైనా రావాలని తెదేపా చేసే కుట్రలకు ప్రజలు సరైన తీర్పునిచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. నగరంలోని అరండల్ పేటలో లేళ్ల అప్పిరెడ్డి కార్యాలయం నుంచి వైకాపా నాయకులు, కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలను ధరించి ప్రదర్శనగా లాడ్జికూడలి వరకు వెళ్లారు. మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. వివేకానందరెడ్డిని తెదేపా ప్రభుత్వం అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేసిందని, చివరికి భౌతికంగా దూరం చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న ఇటువంటి దాడులను ప్రజలు ముక్తకంఠంతో ఖండిస్తున్నారన్నారు. గుంటూరు పార్లమెంట్ నియోజక వర్గ వైకాపా అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 25 రోజులు మాత్రమే తెదేపా పాలన ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. అరాచకాలు సృష్టించి అధికారంలోకి రావాలని తెదేపా చేస్తున్న కుట్రలను తిప్పికొట్టే రోజులు దగ్గరపడ్డాయన్నారు. తొలుత అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తాడికొండ సమన్వయకర్త ఉండవల్లి శ్రీదేవి, నగర అధ్యక్షుడు పాదర్తి రమేష్‌గాంధీ, వైకాపా న్యాయ విభాగం అధ్యక్షుడు పోలూరి వెంకటరెడ్డి, రాష్ట్ర నాయకులు ఆతుకూరి ఆంజనేయులు పలువురు నాయకులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment