ఒంగోలు , న్యూస్‌టుడే:
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాకు రూ.9.01 కోట్లు నిధులు విడుదలయ్యాయి. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరగనున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ తొలి విడతగా జిల్లాకు బడ్జెట్ కేటాయించింది. ఆ నిధులు ప్రత్యేకంగా ఎన్నికలకు వినియోగించనున్నారు. జిల్లాలో 3,269 పోలింగ్ కేంద్రాలకు అవసరమైన ఎన్నికల సామగ్రి కొనుగోలు చేయాలని ఇప్పటికే కలెక్టర్ వి.వినయ్‌చంద్ అధికారులను ఆదేశించారు. పోలింగ్ కేంద్రాలకు అత్యవసరంగా సౌకర్యాలు, మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. వీటిని సెంట్రల్ ఫైనాన్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ద్వారా ఆయా విభాగాలకు కేటాయిస్తూ కలెక్టర్ వినయ్‌చంద్ అధికారులకు సూచించారు.
No comments:
Post a Comment