న్యూస్‌టుడే:
- ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోవడానికైనా తాము సిద్ధం.
- వాయుసేన అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరిస్తొంది.
భారత్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. నిన్న రాత్రి పంజాబ్, జమ్ముకాశ్మీర్ సరిహద్దుల్లో భారత వాయుసేనకు చెందిన యుద్ద విమనాలు గాల్లో చక్కర్లు కొట్టాయి. ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోవడానికైనా తాము సిద్ధంగ ఉన్నామని పాక్‌కు హచ్చరికలు జారీ చేశాయి. ఈ ఎక్సర్ సైజ్ లో భారీ సంఖ్యలో యుద్ధ విమానాలు పాల్గొన్నాయి. ఈ విమానాలన్ని సూపర్ సోనిక్ వేగంతో ఆకాశంలో దూసుకుపోయాయి. బాలాకోట్ లోని జైషీ మొహమ్మద్ స్థావరాలపై దాడి చేసినప్పటి నుంచి మన వాయుసేన అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరిస్తొంది. ఏ క్షణంలోనైనా శత్రు దేశంపై దాడికి దిగేలా సన్నద్ధంగా ఉంది. ఇప్పటికి సరిహద్దుల్లోని ఎయిర్ బేస్ లలో జెట్ ఫైటర్లు భారీ సంఖ్యల్లో మోహరించాయి. ఎయిర్ ఫోర్స్ హై విమానాలు సరిహద్దు వద్దకు చొచ్చుకు వచ్చాయి. ఈ నేపథ్యంలో, భారత వాయుసేన పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది.
No comments:
Post a Comment