కర్నూలు న్యూస్‌టుడే:
*అన్ని పంచాయతీల్లో ఉపాధి హామీ పథకంలో పనిచేసే కూలీల సంఖ్యను పెంచాలని ఎంపీడీవో గౌరీదేవి సిబ్బందిని ఆదేశించారు…
*గ్రామాల్లో చేపట్టిన ఉపాధి పనులను ఆమె పరిశీలించారు…
మండలంలోని అన్ని పంచాయతీల్లో ఉపాధి హామీ పథకంలో పనిచేసే కూలీల సంఖ్యను పెంచాలని ఎంపీడీవో గౌరీదేవి సిబ్బందిని ఆదేశించారు. బుధవారం మండల పరిధిలోని సంకిరేణిపల్లె, పగిడ్యాల గ్రామాల్లో చేపట్టిన ఉపాధి పనులను ఆమె పరిశీలించారు. ఉపాధి కూలీలు పనికి రాకుండానే మస్టర్లలో సంతకాలు చేస్తుండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సాంకేతిక సహాయకుల పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఇలాంటి అక్రమాలు చోటు చేసుకుంటాయని, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కూలీలు 6గంటలు పనిచేస్తే రూ.205 వస్తుందని, కొలతల ప్రకారం పనులు చేపట్టాలని ఎంపీడీవో పేర్కొన్నారు.
No comments:
Post a Comment