బాలీవుడ్ న్యూస్‌టుడే: విభిన్న పాత్రలను ఎంచుకోవడంలో బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్‌ది ఓ ప్రత్యేక శైలి. కథానాయకుడిగానే కాకుండా ప్రతినాయకుడి పాత్రలైనా లేక స్పెషల్ అప్పీరియన్స్ పాత్రలైనా తనకు నచ్చితే చాలు వెంటనే అంగీకరించేస్తుంటారు. అలా తను ఆలోచించి ఎలాంటి అరమరికలు లేకుండా నటించిన సినిమాలన్నీ బాక్సాఫీసు వద్ద కనకవర్షం కురిపించడంతో తను అనుకున్న రూట్‌లో ప్రయాణాన్ని ఆయన దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు. గతంలో వచ్చిన రుస్తుంలో నావికాదళ అధికారిగా ఆకట్టుకున్న ఆయన ఆ తర్వాత జాలీ ఎల్‌ఎల్‌బీ-2, టాయ్‌లెట్…ఏక్ ప్రేమ్‌కథ సినిమాలను చేశారు. ఇక నెలసరి సమయంలో మహిళలు పడే ఇబ్బందులను వెల్లడిస్తూ..ప్యాడ్‌మాన్, హాకీ నేపథ్యంలో గోల్డ్, పక్షిరాజుగా పర్యావరణ ప్రేమికుడి పాత్రలో 2.0. చిత్రాలలో విభిన్నంగా కనిపించిన ఆయన ఇదే నెలలో రాబోతున్న కేసరి చిత్రంలో సైనిక హవల్దార్ ఇషార్‌సింగ్ పాత్రలో కనిపించబోతున్నారు.

No comments:
Post a Comment